Monday, October 14, 2024

పులికేసి సీక్వెల్ కు రంగం సిద్ధం ? శంకర్ వడివేలు గొడవ సద్దుమనిగినట్టే !!

సంచలన దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోలు శంకర్ తో సినిమా చేయడానికి రెడి గా ఉంటారు. అయితే శంకర్ గతంలో ప్రముఖ కమెడియన్ వడివేలు తో పులికేసి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. అయితే దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా పులికేసి సీక్వెల్ ను నిర్మించాలని శంకర్ భావించాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత కథలో కొన్ని మార్పులు చేశారు అంటూ వడివేలు షూటింగ్ కు పాల్గొనడానికి నిరాకరించాడు. దీంతో శంకర్ వడివేలు మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు నిర్మాతల మండలిలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.

వడివేలు కారణంగా రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని శంకర్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడివేలు నటనకు దూరమయ్యాడు. అయితే తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వీరిద్దరితో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ కు నష్టపరిహారం చెల్లించడానికి నటుడు వడివేలు అంగీకరించాడట.త్వరలోనే పులికేసి చిత్రం కూడా పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement