Friday, April 19, 2024

మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందా ?

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. అదే జోష్ తో ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అయితే దీంతో పాటు మరో సినిమాని కూడా చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ తో సినిమా చేయబోతున్నాడట రవితేజ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది.

ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత హరీష్ రవితేజతో సినిమా పట్టాలు ఎక్కించబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement