Thursday, April 18, 2024

బాలయ్య పుట్టినరోజుకి ఆ ఒక్కటేనా ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. సింహా , లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ నెల 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందోనని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈసారి ఒక పోస్టర్ మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ సింగిల్ కోసం ఎప్పటి నుంచో ఎదురు ఎదురు చూస్తున్నారు. వీటిపై ఇంకా క్లారిటి రాలేదు. మరి పోస్టర్ ఒకటే కన్ఫామ్ చేస్తారా లేక మరొకటి ఉంటుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement