Friday, April 19, 2024

రాధే శ్యామ్ మరో కొత్త ప్రపంచమా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో పది రోజులు రీషూట్ కి ప్లాన్ చేసుకోగా కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రంలోని కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఇక ఆ లొకేషన్స్ చూస్తుంటే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అర్ధమైపోతుంది. అలాగే ఒక సాంగ్ లొకేషన్ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ రాధాకృష్ణ ప్రభాస్ పూజ హెగ్డే ల తో ఏదో మాయ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ప్రభాస్ అభిమానులు అయితే సరికొత్త ప్రపంచాన్ని చూపించేటట్టే కనిపిస్తున్నారు అంటూ చెబుతున్నారు. మరి ఎంతవరకు రాధాకృష్ణ అలా చూపించడంలో సక్సెస్ అవుతాడో తెలియాలంటే థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement