Thursday, March 28, 2024

త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆది పురుష్, సలార్, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఇదిలా ఉండగా ఓ వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు ఫుల్ హ్యాపీ నెస్ ను ఇస్తోంది. అదేంటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట.

ఇప్పటికే త్రివిక్రమ్ ప్రభాస్ కు ఓ స్క్రిప్టుని వినిపించాడట. అయితే ఆ స్క్రిప్ట్ ప్రభాస్ కు విపరీతంగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉండటంతో పాటు అటు త్రివిక్రమ్ కూడా బిజీ గా ఉన్నారు. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement