Thursday, April 25, 2024

పవన్ దిల్ రాజుకు మరో ఛాన్స్ ఇవ్వటానికి జగనే కారణమా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. అయితే ఏపి లో మాత్రం సినిమా టికెట్ల ధర విషయంలో వివాదం చెలరేగింది. ఇక టికెట్ ధరలు తగ్గిపోవడంతో ఏపీలో నష్టాలు కూడా వచ్చాయి. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ ను నిర్మాత దిల్ రాజు వివరించారట..

దీంతో పవన్ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి.. దిల్ రాజు కు సహాయపడాలనే ఆలోచనకు వచ్చాడట. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తో మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం తెలియట్లేదు. అదే కనుక నిజమైతే దిల్ రాజు జాక్ పాట్ దొరికనట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement