Friday, March 29, 2024

మోక్షజ్ఞ పై బాలయ్య ప్రయోగం అవసరమా ?

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశాడు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆదిత్య369 కి సీక్వెల్ గా ఉండబోతుందని అలాగే ఆ సినిమాకు దర్శకత్వం కూడా తానే చేయబోతున్నట్లు ప్రకటన చేశాడు. కానీ ఆ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అయితే బాలయ్య మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్షన్ అని చెప్పడంతో నందమూరి అభిమానులు అంతా కాస్త కంగారు పడుతున్నారు. మొదటి సినిమాకి ప్రయోగం అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సమయంలో రిస్క్ అవసరమా అని అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య ఆ రిస్క్ తీసుకుంటాడో లేక ఆ బాధ్యతను వేరొకరికి ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement