Saturday, April 20, 2024

అనుష్క ఇప్పుడైనా పెళ్లి పీటలు ఎక్కుతుందా ?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుష్క. అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్ గా కూడా సూపర్ డూపర్ హిట్ లను అందుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపిన అనుష్క ఇప్పుడు అతి తక్కువ సినిమాలను మాత్రమే చేస్తోంది. గతేడాది నిశ్శబ్దం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు..

ఇదిలా ఉండగా అనుష్క పెళ్లికి సంబంధించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అనుష్క త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటూ నెటిజన్లు కూడా మాట్లాడుకున్నారు. ఇటువంటి సమయంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాకు అనుష్క ఓకే చెప్పింది. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి తో అనుష్క స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. నిజానికి ఈ సినిమాను 2021లో పట్టాలెక్కాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా నిర్మాతలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. దీనితో అనుష్క పెళ్లి విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి ఈ గ్యాప్ లో అనుష్క పెళ్లి పీటలు ఎక్కుతుందా లేక సినిమాలే చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement