Friday, April 19, 2024

వకీల్ సాబ్ కు ఐపీఎల్ ఎఫెక్ట్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఐపీఎల్ ఎఫెక్ట్ పడిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మొదటి రోజు సుమారు 37 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేసింది. ఆ తర్వాత ఈ రోజు కూడా పది కోట్లు వరకు షేర్స్ ను వసూలు చేసింది. ఇక మూడో రోజు 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇలా ఉండగా ఇప్పటికే ఏపీలో టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా పడినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ ఈవెనింగ్ షో లకు ఐపీఎల్ మ్యాచ్ లు దెబ్బ కొడుతున్నాయట. ఇక ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. నివేద థామస్, అంజలి ,అనన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement