Tuesday, April 23, 2024

ఎన్టీఆర్ సింహాద్రి రీ-రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..

గ్లోబల్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రీ-రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ డాల్బీ డిజిటల్ 5.1తో 4K UHD ఫార్మాట్‌లో రిలీజ్ కానుంది.

సినిమా రీ-రిలీజ్ కోసం ప్రింట్లు సిద్ధమవుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, అంకిత కథానాయికలుగా నటించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీత దర్శకుడిగా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement