Friday, April 19, 2024

కాంతార సీక్వేల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన భారీ హిట్ మూవీ “కాంతారా”. కన్నడ నుంచి డబ్ అయ్యి తెలుగు సహా హిందీ లో కూడా రిలీజ్ అయ్యి ఓ డివోషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా గత ఏడాది వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మైవీ సక్సెస్ తో అయితే మేకర్స్ పార్ట్ 2 కూడా ఉటుంద‌ని అనౌన్స్ చేశారు. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సినీ స‌ర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ మూవీ పార్ట్ 2 ఉంటుంది కానీ అది కొనసాగింపు సినిమాగా ఉండదట. ఇది కాంతారా కి ప్రీక్వెల్ గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అలాగే ఈ ప్రీక్వేల్ సినిమాకి కూడా రిషబ్ దర్శకత్వం వహించ‌నున్నాడ‌ట‌. అంతేకాక‌ ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి వచ్చే ఏడాది సమ్మర్ లో తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సినీవ‌ర్గాల‌ సమాచారం. మ‌రి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement