Thursday, April 25, 2024

హన్సిక కొత్త సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’ పై ఆసక్తికర వార్త

దేశముదురు సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు హన్సిక. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ అమ్మడు ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో నటిస్తోంది. రమ్య నాగేందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.

అయితే ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు కొన్ని విషయాలను తెలియజేస్తూ… హన్సిక ఇప్పటివరకు ఇలాంటి పాత్ర పోషించలేదు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఒక యువతి తన జీవితంలో ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొంది… అనేది చిత్ర కథాంశం. ఆగష్టు 2వ వారంలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం అంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాస్. మురళి శర్మ, జయప్రకాశ్, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement