Sunday, September 15, 2024

Inaya Sulthana | ఇసుక తిన్నెల‌లో అందాల విందు….

ఇనయా సుల్తానా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పార్టీల్లో డ్యాన్సులు చేస్తూ.. ఫోటోలు దిగుతూ ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. అదే సమయంలో బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు సీజన్-6లో పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్ లో తన మాట అండ్ ఆట తీరుతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.

తన అందంతో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంది. సినిమా ఛాన్సులు అందుకోలేదు. పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. క్రమంగా తన ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉంటుంది. ఒక్కసారి పద్ధతిగా.. మరోసారి గ్లామరస్ గా ఫిదా చేస్తుంటుంది. తన పోస్టులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఇనయా. బీచ్‌లో ఇసుకతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది.

వింత వింత ఫోజుల్లో ఫోటోలు దిగుతూ పోస్ట్ చేసింది. గాలిలో ఉప్పు.. నా జుట్టులో ఇసుక.. ఇసుకతో మాట్లాడండి అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. మినీ డ్రెస్ వేసుకున్న ఇనయా.. అందాలు ఓ రేంజ్ లో ఆరబోసింది. రకరకాల పోజుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ అల్లరి చేసింది. ఇసుకలో కూర్చుని, పడుకొని పోజులు ఇచ్చి హీట్ పుట్టించింది. ప్రస్తుతం ఇనయా నయా పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement