Thursday, March 28, 2024

అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ సినిమాదే ఎక్కువట !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ పరంగా ఓవర్సీస్ డీల్ భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. అయితే అల్లుఅర్జున్ గత చిత్రాల కన్నా… ఏ సినిమాకు కూడా రాని విధంగా ఈ సినిమా అమ్ముడు పోయిందట. అయితే దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్ లు రాబోతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement