Thursday, April 25, 2024

రాశీఖన్నా కోసం డిఫ్రెంట్ రోల్ ? సినిమాలో కాదు !!

ఇటీవల కాలంలో డిజిటల్ రంగానికి ఆదరణ పెరిగింది. దీంతో హీరోయిన్స్ అంతా కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ బాట పట్టారు. ఇప్పుడు రాసి కన్నా కూడా అదే త్రోవ లో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో రాసి కన్నా ఓ డిటెక్టివ్ రోల్ పోషించబోతున్నారట. ఎన్నో ట్విస్టులతో ఈ వెబ్ సిరీస్ సాగనుందట.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉండగా… ప్రతి ఎపిసోడ్ కూడా 40 నిమిషాలపాటు ఉంటుందట. ఇక ఈ సిరీస్ కు కొత్త డైరెక్టర్ సూర్య వంగల దర్శకత్వం వహించబోతున్నారు. సోనీ లైవ్ ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement