Friday, March 29, 2024

అన్ని కుదిరితే ఈ రోజే కేజీఎఫ్ 2 రిలీజ్ !!

రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను జూలై 16న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ కుదరలేదు.

అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. కాగా ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పై ఈ రోజు క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement