Tuesday, March 26, 2024

ఆ హీరో చేసిన పని మరిచిపోలేను…డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

కల్కి, జాంబి రెడ్డి, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ప్రతి ఒక్కరికి సహనం ఓర్పు కావాలని అలాగే ప్రతి హీరో కూడా దర్శకుడి పై నమ్మకంతోనే సినిమా ఒప్పుకుంటాడని చెప్పుకొచ్చాడు. అలాగే దర్శకులకు ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయని తాను కూడా అందుకు మినహాయింపు కాదని… ఒక హీరో తనతో చాలా కఠినంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు.

ఒక హీరోకు కథ చెప్పటానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ముందుగా ఆయన కి కాల్ చేసి ఆయన ఇంటి దగ్గరికి చేరుకోగానే పెద్ద వర్షం మొదలైంది. దాంతో గేటు బయటే ఉండి ఆయన కు కాల్ చేసి నేను వచ్చినట్లు చెప్పాను. ఆయన లోపలికి రమ్మనకుండా వెయిట్ చేయమన్నాడు. ఆ వర్షంలో అలాగే వెయిట్ చేయించాడు. ఆ వర్షంలో తడిసిపోతూ ఆయన ఇంటి వైపు చూస్తూ నిలబడ్డాను. కిటికీలోంచి నన్ను ఆయన చూస్తుండటం నేను గమనించాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement