Thursday, April 25, 2024

టీచర్ అవ్వాలనుకున్న కానీ ఇలా అయిపోయా – రష్మీక

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ ప్రారంభంలో కాస్త స్లోగా ప్రారంభించినప్పటికీ… తర్వాత ఊపందుకుంది. కాగా నిజానికి రష్మీక టీచర్ కవలనుకుందట. కానీ విధి రాత కారణంగా యాక్టర్ అయ్యానని చెప్తుంది ఈ బ్యూటీ. జీవితంలో అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవుతుంది. అందుకు తన జీవితమే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చింది.

మైసూరులో చదువుతున్నప్పుడు టీచింగ్ వృత్తిలో సెటిల్ అవ్వాలి అనుకునేదాన్ని. ఎందుకో తెలియదు దానిపై ఉన్న ఇష్టంతో డిగ్రీ లో ఇంగ్లీష్ లిటరేచర్ తో పాటు సైకాలజీ సబ్జెక్టు కూడా తీసుకున్నాను. అయితే భగవంతుడు నాకు వేరేలా రాసి పెట్టాడు. డిగ్రీ చేసేటప్పుడు మోడలింగ్ లో ప్రవేశించాను. ఇదిగో ఇలా సినిమాల్లోకి వచ్చేసాను. అందుకే ఇదంతా చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందంటూ తెలిపారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో కూడా రష్మిక మందన నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement