Thursday, April 25, 2024

జ‌క్క‌న్న కొత్త ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు.. సూప‌ర్ స్టార్ మహేశ్‌తో గ్లోబ్ ట్రోటింగ్ మూవీ!

భారతదేశం గర్వించేలా చేసిన విజ‌న‌రీ డైరెక్టర్ SS రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. కాగా, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ గ్లోబ్‌ట్రోటింగ్ మూవీ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించాడు. దర్శకుడి లాస్ట్ ప్రాజెక్ట్ RRR ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఈ మూవీపై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ ఏడాది జూన్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఈ మూవీ స్క్రిప్ట్‌ను అతి త్వరలో పూర్తి చేసి, రాజమౌళి ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే రాజమౌళి మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రాజమౌళి-మహేష్ బాబు మెగా ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్‌పై కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో మేకర్స్ ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement