Tuesday, April 23, 2024

సూపర్ – 40 కోట్లతో పుష్ప యాక్షన్ సీన్ ?

క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. 40 కోట్ల అనగానే ఆ సీన్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి ఫ్యాన్స్ లోపెరిగింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు,ప్రకాష్ రాజ్ ,సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement