Tuesday, March 26, 2024

బ్ర‌హ్మాస్త్రలో ప‌వ‌ర్ ఫుల్ రోల్, నో చెప్పిన హృతిక్ రోష‌న్‌.. కార‌ణ‌మేంటో తెలుసా!

సోషియే ఫాంట‌సీ, ఇండియ‌న్ సూప‌ర్ మూవీగా త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న సినిమా బ్ర‌హ్మ‌స్త్రం.. దీనికి ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్ష‌న్ చేశారు. ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఇక‌.. అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన మ‌రో సూప‌ర్ స్టార్ ని కూడా చూపించాల‌నుకున్నారు అయాన్. బ్రహ్మాస్త్రలో ఓ ముఖ్య‌మైన‌ పాత్రను చేయాలని హృతిక్ రోషన్‌ను సంప్రదించిన‌ట్టు స‌మాచారం. అదే విధంగా ‘బ్రహ్మాస్త్ర-2 లో దేవ్ పాత్ర చేయాల‌ని కోరార‌ట‌. కానీ, ఈ రోల్స్‌‌ను చేసేందుకు హృతిక్ రోషన్ మాత్రం నిరాకరించిన‌ట్టు తెలుస్తోంది. మేకర్స్‌కు హృతిక్ రోషన్ పెద్ద‌ షాకిచ్చాడని బీ టౌన్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

హృతిక్ చేతిలో ప్రస్తుతం ‘క్రిష్-4’, ‘రామాయణ’ ప్రాజెక్టులున్నాయి. ఈ సినామాల‌ కోసం చాలా టైమ్ వెచ్చించాల్సి ఉంది. ‘బ్రహ్మాస్త్ర-2’ లో దేవ్ పాత్ర కోసం కూడా భారీగా సమయన్ని కేటాయించాలి. ఈ కార‌ణంగా.. కాల్షీట్స్‌ను కేటాయించలేక ఈ పాత్రను హృతిక్ నిరాకరించాడని తెలుస్తోంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement