Friday, March 29, 2024

పవన్ అంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ కు ఎంత ఇష్టమో!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులతో పాటు సినీ స్టార్స్ కు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కాగా అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమట.

కాగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి ,జానీ చిత్రాల ఆడియో క్యాసెట్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో నటించిన పెప్సీ యాడ్ తాలూకా పోస్టర్ ను సందీప్ సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్ట్ చేశాడు. ఇది తన జ్ఞాపకాల బంగారు నిధి అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ వంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement