Monday, October 7, 2024

HIT 3 | ఫుల్ స్వింగ్ లో నాని… ”హిట్ 3” రిలీజ్ డేట్ ఫిక్స్ !

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”తో హ్యాట్రిక్ హిట్ సాధించి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కాగా, వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దర్శకుడు శైలేష్ కొల‌ను తెర‌కెక్క‌స్తున్న‌ మాస్ పోలీస్ యాక్షన్ డ్రామా “హిట్ 3” గురించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

పోలీస్ యాక్షన్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా నుండి లేటెస్ట్ మాస్ పోస్టర్‌తో పాటు, నానిని అర్జున్ సర్కార్‌గా పరిచయం చేస్తూ ఆసక్తికరమైన మాస్ గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. దాంతో పాటు ఈ మూవీని వచ్చే ఏడాది మే1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసేసారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement