Thursday, April 18, 2024

‘హైవే’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ !!

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హైవే. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన మానసా రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. అయితే నిర్మాత తలారి వెంకట్ మాట్లాడుతూ హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నామని ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement