Saturday, April 20, 2024

తమిళ స్టార్ హీరోకు జరిమానాపై స్టే ఇచ్చిన హైకోర్టు

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారు పన్ను మినహాయింపు విచారణ సందర్భంగా కోర్టు వేసిన జరిమానా కు మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మిగిలిన 80 శాతం పన్ను వారం లోపు చెల్లించాలని ఆదేశించింది. అయితే గతంలో లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రీల్ హీరోలు కాదు రియల్ హీరో కండి అంటూ న్యాయ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని విజయ్ పిటిషన్ వేశారు.

అయితే విచారణ చేపట్టిన ధర్మాసనంకు దిగుమతి చేసుకున్న కారు పన్ను పదిరోజుల్లో చెల్లించేందుకు మేము సిద్ధమని… కానీ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని విజయ్ తరుపు న్యాయవాది తెలిపారు. కాగా జరిమానా స్టే విధించిన ధర్మాసనం… న్యాయమూర్తి వ్యాఖ్యలపై విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement