Thursday, April 18, 2024

కాజల్..నిషా అగర్వాల్ ఫొటో షూట్

హీరోయిన్స్ గా సత్తా చాటారు సిస్టర్స్ కాజల్ అగర్వాల్..నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన కొన్నేళ్లకు తన చెల్లెలు నిషా అగర్వాల్‌ను కూడా తీసుకొచ్చేసింది. కానీ నిషా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైపోయింది. మరోవైపు కాజల్ అగర్వాల్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. ఇటు యంగ్ హీరోలు.. అటు సీనియర్ హీరోలతో జతకడుతోంది. కాజల్ కూడా పెళ్లి చేసుకుని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన సినీ కెరీర్‌ను సాగిస్తోంది. ఈ అగర్వాల్ సిస్టర్స్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి అజా అనే ఓ మేగజైన్ కోసం ఫొటోషూట్ చేశారు. ఈ ఫొటోల్లో అగర్వాల్ సిస్టర్స్‌ స్టన్నింగ్ లుక్స్‌లో సందడి చేశారు. అజా మేగజైన్ కోసం కాజల్-నిషా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అగర్వాల్ సిస్టర్స్ ట్విన్స్‌లా కనిపిస్తున్నారు. ట్రెడిషనల్ అండ్ ట్రెండీ వేర్‌లో స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement