Thursday, May 6, 2021

పవన్ మహేష్ గురించి శృతి ఏం చెప్పిందో తెలుసా ?

కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్ లను అందుకని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కూడా ఈ అమ్మడు సందడి చేసింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అయింది.

కాగా అందులో తనకు టాలీవుడ్ లో ఫస్ట్ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, అలాగే మరో హిట్ ఇచ్చిన మహేష్ బాబు కోసం మాట్లాడింది. మహేష్ బాబు ఒక జెంటిల్మెన్ అంటూ ఒక మాటలో చెప్పేసింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఇతిహాసాలు సరిపోవు అన్నట్లుగా రిప్లై ఇచ్చింది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News