Thursday, April 25, 2024

అమ్మాయిలు ‘నో అంటే నో’ వకీల్ సాబ్ పై రీతు వర్మ ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సినీ స్టార్స్ అందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే వెబ్ సిరీస్ లను, ఓటీటీ లలో రిలీజ్ అయిన సినిమాలు చూస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా చూసిన రీతు వర్మ పవన్ పై ప్రశంసల జల్లు కురిపించి. ఒక్కసారి అమ్మాయి నో అంటే నో అనే మాటకి రీతూవర్మ కనెక్ట్ అయింది. లాయర్ సత్యదేవ్ పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే… అని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్.. హ్యాట్సాఫ్ సార్ అంటూ ట్వీట్ చేసింది. ఇక రీతూవర్మ 2016 లో విడుదలైన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ప్రస్తుతం నాని సరసన టక్ జగదీష్, నాగశౌర్య వరుడు కావలెను సినిమాలలో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement