Tuesday, March 26, 2024

రెజీనా కూడా స్టార్ట్ చేసింది

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరిగింది. దీంతో డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు స్టార్ హీరోయిన్స్. ఇప్పటికే కాజల్ అగర్వాల్ తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తుండగా తాజాగా రెజీనా కూడా వాళ్లని ఫాలో అయింది. ఆహా లో ప్రసారమయ్యే ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అన్యాస్ ట్యుటోరియల్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ వెబ్ సిరీస్ కు గంగిరెడ్డి పల్లవి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఇటీవల ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

అలాగే ఈ కథ తనని ఎంతగానో ఆకట్టుకుందని… ప్రతిభావంతులైన మహిళా బృందంతో ఈ వెబ్ సిరీస్ ను చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఈ వెబ్ సిరీస్ ను క్రిస్మస్ కు రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement