Friday, April 19, 2024

బాలయ్యతో మరోసారి రొమాన్స్ కి మీనా రెడీ ?

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మీనా పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన మీనా వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమాలో నటిస్తోంది..

ఇక తాజాగా ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మీనా. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించబోతోందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో మీనా కనిపించబోతున్నారని సమాచారం. గతంలో బాలకృష్ణ మీనా కాంబినేషన్ లో ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం, కృష్ణ బాబు, అశ్వమేధం వంటి సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాగానే గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement