Sunday, May 16, 2021

కరోనా ఎలాంటిదో క్లారిటీగా చెప్పిన పవన్ హీరోయిన్ !!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కారణంగా వచ్చే ఇబ్బందుల గురించి హీరోయిన్ కృతి కర్బందా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు తెలియదు…కరోనా అనేది మీ ఇంటికి వచ్చే వరకు అది ఎంత ప్రమాదకరమో.. నేను మరియు మా కుటుంబ సభ్యులు 48 గంటల పాటు అనుభవించిన బాధ దారుణం. నరకం అనుభవించాను. అందుకే దయచేసి ఇంట్లోనే ఉండండి.

మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ పరిస్థితి మీ కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. మీరు ఈ రోజు ఇంట్లో ఉంటేనే ముందు ముందు ఏ పని అయినా చేసుకునే వీలు ఉంటుందని విషయాన్ని గుర్తు పెట్టుకోండి.మ్ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది కృతికర్బంధ. ఇక కృతి కర్బందా గతంలో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించింది. అయితే అంత పెద్ద సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News