Sunday, June 13, 2021

డాక్టర్స్ పై దాడులా ?? సాయిధరమ్ తేజ్ హీరోయిన్ ఫైర్

కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేద ప్రజలు చనిపోతున్నారు. అయితే ఆస్పత్రిలో కొంతమంది చికిత్స పొందుతూ కూడా చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మృతుడి బంధువులు డాక్టర్ల పై దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇదే విషయం పై హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఖండించారు. నేను కూడా ఎంతో ప్రియమైన వారిని కోల్పోయానని…కానీ తాను ఇలా డాక్టర్లను కొట్టాలని ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేయాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. ఒక చెడ్డ వైద్యునికి ఫేస్ చేసిన తాను అందరు డాక్టర్లు అలాగే ఉంటారు అనే అభిప్రాయానికి రాలేదని క్లారిటీ ఇచ్చింది.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాత్రి పగలు తేడా లేకుండా వైద్యులు పని చేస్తున్నారని అలాంటి వారి పట్ల అంత చీప్ గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు అని ప్రశ్నించింది. తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ బయట అపార్ట్మెంట్స్ తీసుకొని డ్యూటీలు చేస్తున్నారని కొన్ని నెలలుగా తన కుటుంబ సభ్యులను కూడా కలవకుండా జీవిస్తున్నారని చెప్పుకొచ్చింది. అలాంటి వారికి ట్రిబ్యూట్ ఇవ్వాలి కానీ ఇలా తలలు పగలగొట్టేలా ఉండకూడదు అని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News