Thursday, April 25, 2024

నాగ చైతన్యకు హీరోయిన్ ఫిక్స్ !!

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాని ప్లాన్ చేసారు దర్శకుడు.

ఆగస్టు 16 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి షెడ్యూల్ లో నాగార్జున, రమ్య కృష్ణ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా చైతు కి జోడిగా కృతి శెట్టి నటించబోతోంది. ఇక సంక్రాంతే టార్గెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement