Thursday, April 25, 2024

విష్వ‌క్సేన్ బ‌ర్త్ డే.. 11వ చిత్రం అనౌన్స్

త‌న 11వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు య‌గ్ హీరో విష్వ‌క్సేన్. నేడు ఆయ‌న బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటించబోయే తన 11వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి ప్రకటన వీడియో ప్రకారం ఈ చిత్రంలో విష్వక్సేన్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇచ్చిపడేద్దాం అనే క్యాప్షన్ తో విష్వక్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ఈ ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ అనేవి ఉండవు. ఉండేది గ్రే మాత్రమే. మాస్ కా దాస్ టర్న్స్ బ్యాడ్ అనే క్యాప్షన్స్ తో సాగే వీడియోకు యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుటోంది. కాగా ఆయ‌న స్వీయ దర్శకత్వంలో ‘దస్ కా ధమ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విష్వక్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్సన్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement