Friday, April 19, 2024

హీరో విజ‌య్‌ రెమ్యునరేషన్‌ 90 కోట్లా..?

కోలీవుడ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ రెమ్మునరేషన్ కి సంబంధించి ఓ వార్త దక్షిణాదిలో కాక రేపుతోంది. తన తదుపతి చిత్రం కోసం విజయ్ 90 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడనే వార్తలు వస్తున్నాయి. విజయ్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజు, డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతుంద‌ని వార్త‌లు వినిపిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ చేయాల‌నుకుంటున్న‌ట్లు ఆలోచిస్తున్నారు. అందుకు త‌గిన‌ట్లే అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్‌తో సినిమాను రూపొందించ‌డానికి క‌థ‌ను సిద్ధం చేయిస్తున్నారు. కాగా..లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం ఈ సినిమాకు దిల్‌రాజు భారీ దాదాపు రూ.170 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ట‌. ఇందులో హీరో విజ‌య్‌కు రూ.90 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ని అంటున్నారు. కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు విజ‌య్ రీసెంట్ టైమ్‌లో త‌న సినిమాల‌కు రూ.80 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. దాన్ని మించిన రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి దిల్‌రాజు, విజ‌య్ డేట్స్ తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement