Thursday, March 28, 2024

‘గని’ అప్డేట్ తగ్గేదేలే అంటున్న వరుణ్ !!

ముకుంద సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సరికొత్త కథలు ఎంచుకుంటూ అభిమానులకు కొత్తదనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. కరోనా వైరస్ ఎక్కువ అవుతుండడంతో చాలా వరకు సినిమాల షూటింగ్ లను నిలిపివేస్తున్నారు. వరుణ్ మాత్రం గని సినిమాను పట్టా లెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇండోర్ షూటింగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ మంది సిబ్బందితో సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు నిర్మాత భావిస్తున్నారట. అందుకు వరుణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ ఇంకొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement