Thursday, April 25, 2024

సూర్య పూర్తిగా వకీల్ సాబ్ లా మారిన వేళ…. ఫోటో వైరల్

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ వుంది సూర్యకు. దాదాపుగా సూర్య చేసే సినిమాలు అన్నీ కూడా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు సూర్య.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో టీజె జ్ఞానవేల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. లాయర్ గెటప్ లో లొకేషన్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో నల్లకోటు ధరించి సూర్యా కనిపించాడు. ఇక ఇటీవల వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి సూర్య ఈ సినిమాతో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement