Friday, April 19, 2024

మే ‘డే’…సుదీర్ బాబు లుక్ వైరల్

సుధీర్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా వి సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందరికీ ఆకట్టుకున్నాడు. ఇక ప్రతి సినిమాలో కూడా తన లుక్ కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటాడు సుధీర్ బాబు. వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాగా ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓ పోస్టు ద్వారా ఆకట్టుకున్నాడు సుదీర్ బాబు.

ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి సెల్యూట్..!! మనందరం ఒకరికొకరం అంటూ సోషల్ మీడియా ద్వారా మే డే శుభాకాంక్షలు తెలియజేశారు సుధీర్ బాబు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఆయన సిక్స్ ప్యాక్ లుక్ వావ్ అనేలా ఉంది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికుడిగా టోపీ మరియు పనిముట్లు పట్టుకుని నిలబడ్డాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ – గడ్డం మీసాలతో ఉన్న సుధీర్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే సుధీర్ ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement