Wednesday, March 27, 2024

బర్త్ డే స్పెషల్ – మహాసముద్రం నుంచి సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం అజయ్ భూపతి శర్వానంద్ సిద్దార్థ ప్రధానపాత్రలో మహాసముద్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం సినిమా నుంచి సిద్దార్థ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే శర్వానంద్, అతిధి రావు హైదరి ఫస్ట్ లుక్స్ ను యూనిట్ రిలీజ్ చేసింది. అలాగే ఆగస్టు 18న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement