Friday, April 19, 2024

చల్లగాలిలో వర్కవుట్స్ చేస్తోన్న.. రామ్ చరణ్

ఎప్పుడూ ఏదో ఒక కొత్త వర్కవుట్స్ చేస్తూ వుంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పుడూ ఇన్‌డోర్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేసే చరణ్‌ ఇపుడు మాత్రం అవుట్‌ డోర్‌ సెషన్‌ పెట్టుకున్నాడు. కాగా తమిళ స్టార్ డైరెక్టర్ శంక‌ర్ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ఆర్‌సీ 15 . ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. అంజ‌లి, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్‌ ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. రాంచరణ్‌ షెడ్యూల్ షురూ అయ్యే కంటే ముందు నయా జిమ్‌లో చల్లగాలిని ఆస్వాదిస్తూ వర్కవుట్స్‌ చేస్తున్నారు. రాంచ‌ర‌ణ్ ట్రైనర్‌తో కలిసి వర్కవుట్స్‌ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.ఆర్‌సీ 15 చిత్రానికి ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. శంకర్‌ అండ్‌ టీం కొన్ని రోజుల క్రితం ఏపీలోని రాజ‌మండ్రి, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement