Thursday, April 18, 2024

నాగ శౌర్య ప్లాన్ ఏంటో ?

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు ఎండింగ్ స్టేజ్ కు చేరుకోగా మరో రెండు మధ్యలో ఉన్నాయి. నిజానికి నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక అలాగే లక్ష్య సినిమా కూడా దాదాపు కంప్లీట్ అవ్వసాగింది.

అలాగే అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, అలాగే మహేష్ కోనేరు నిర్మిస్తున్న పోలీసువారి హెచ్చరిక ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా ఇప్పుడు నాగ శౌర్యకు ఓ పెద్ద సమస్యను తెచ్చిపెట్టాయి. ఓవైపు నాలుగు సినిమాలు స్పీడ్ గా షూటింగ్ జరిపి రిలీజ్ చేయాలి. అలాగని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడానికి కుదరదు. మరోవైపు ఒక సినిమా రిలీజ్ మరో సినిమా రిలీజ్ కు అడ్డు పడకూడదు. ఇన్ని సమస్యల మధ్య నాగశౌర్య ఈ సినిమాల రిలీజ్ ను ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఏ రెండు సినిమాలు సక్సెస్ సాధించిన నాగశౌర్య కెరీర్ కు మరో ఐదేళ్ళ పాటు అడ్డు ఉండదనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement