Thursday, April 18, 2024

కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అతడు నటించిన ‘ఆవారా’, ‘నా పేరు శివ’ ‘ఊపిరి’, ‘ఖైదీ’, ‘ఖాకీ’ లాంటి సినిమాలు తెలుగులో మంచి హిట్ సాధించాయి. ప్రస్తుతం కార్తీ నటించిన ‘సుల్తాన్’ అనే సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీని మాస్, కమర్షియల్ అంశాలతో భాగ్యరాజా ఖన్నన్ తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. ఆమెకు తమిళంలో తొలి సినిమా ఇదే. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అలాగే ఉంది. ‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఏప్రిల్ 2న ఈ మూవీ విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement