Thursday, April 25, 2024

మా అసోసియేషన్ ఎన్నికల బరిలో హేమ!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇండస్ట్రీలో అగ్గి రాజుకుంటోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజు, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీ చేస్తుండగా…. తాజాగా నటి హేమ అనూహ్యంగా రేసులోకి వచ్చారు.

ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలలో పోటీకి హేమ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పోటీదారుల మద్దతు కూడా కూడగట్టుకునే పనిలో ఉన్నారట. త్వరలోనే టాలీవుడ్ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో శివాజీరాజాపై నరేష్ విజయం సాధించారు. కాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ల మధ్య పోటీ ఉండబోతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement