Friday, March 29, 2024

ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ తో హరీష్ శంకర్ !!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా ఏడే సినిమాలు చేశాడు ఈ డైరెక్టర్. ఇక 8వ సినిమాను ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నాడు. గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేశాడు. అంతేకాకుండా మెగా హీరోలు బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి మెగా హీరోలందరితో సినిమాలు చేశాడు.

అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు హరీష్. కానీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోయే ఈ ప్రాజెక్టుకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇక ఆ ప్రాజెక్టుకు కథను మరో దర్శకుడు దశరథ్ అందిస్తున్నారు. ఇది ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దర్శకుడి గా గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయనప్పటికీ ఇప్పుడు నిర్మాణ భాగస్వామిగా హరీష్ శంకర్ అడుగు పెడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement