Sunday, April 14, 2024

హరిహర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఈ చిత్రం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పవన్ మునుపెన్నడు నటించని పీరియాడికల్ స్టొరీ తో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక మిగిలిన భాగం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా చిత్ర నిర్మాత ఏఎం రత్నం లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమా షూటింగ్ కోసం మేము రెడీ గా ఉన్నామని… అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు బాలీవుడ్ స్టార్ నటుడు నెక్స్ట్ జాయిన్ కానున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మొత్తం సద్దుమనిగాక షూట్ ను వెంటనే స్టార్ట్ చేయనున్నామని అన్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement