Saturday, April 20, 2024

హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ అప్పుడే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరి హరి వీరమల్లు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంను ఏం రత్నం నిర్మిస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ టీజర్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందట. అదేవిధంగా నిధి అగర్వాల్ కు సంబంధించిన లుక్ ను ఆగస్టు 17 ఆమె పుట్టిన రోజు నాడు విడుదల చేయబోతున్నారట. చిత్రానికి ఆక్వామన్, వార్‌క్రాఫ్ట్, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి వీఎఫ్ ఎక్స్ బాధ్యతలను చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement