Thursday, April 18, 2024

హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో రాబోతుందట!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా… క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సగభాగం కు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్ర యూనిట్… మిగిలిన భాగానికి సంబంధించిన షూట్ ను త్వరలోనే ప్రారంభించనుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది మరేదో కాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేయనున్నారట. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. అయితే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా…ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement