Friday, March 29, 2024

వేణు శ్రీరామ్ కు పవన్ ఫ్యాన్స్ ఎలా కృతజ్ఞతలు చెప్తున్నారో తెలుసా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రజల నేటివిటీకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.

ఇదిలా ఉండగా మామూలుగా స్టార్ హీరోల బర్త్ డే కి సోషల్ మీడియాలో అభిమానులు హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్రెండ్ చేస్తూ ఉంటారు. కానీ మొదటి సారి దర్శకుడి పేరును నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అది మరెవరో కాదు వేణు శ్రీరామ్. పింక్ లాంటి సబ్జెక్ట్ ని తీసుకుని పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా తెరకెక్కించి అభిమానులను ఫిదా చేశారు వేణు శ్రీరామ్. ఈ నేపథ్యంలోనే పవన్ అభిమానులు కృతజ్ఞతగా హ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్… అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే 90 వేలకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ నడుస్తోంది. ఇది మున్ముందు మరెంత ముందుకు వెళ్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement