Wednesday, April 17, 2024

మెహందీ ఫోటోలలో గుత్తా జ్వాల అదుర్స్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళ్ హీరో విష్ణు విశాల్ ను ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతోంది. గతేడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఇద్దరు మరికొద్ది క్షణాల్లో భార్యాభర్తల కాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గుత్తాజ్వాలా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. పెళ్లి కూతురు గా ముస్తాబైన గుత్తా జ్వాల ఆ ఫోటోలలో మెరిసిపోతోంది. ఇంకా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువులు సమక్షంలోనే ఈ పెళ్లి జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement