Friday, March 29, 2024

Gossips – హీరోతో డేటింగ్ – నిజం లేద‌న్న హ‌న్సిక‌

కొందరు తారలు ముందువెనుక ఆలోచింకుండా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్య్వూల్లో ఈ పరిస్థితి వస్తుంది. ఇలా చేసే వ్యాక్యలు ఆ తర్వాత వారిని ఇబ్బందుల్లో పెట్టేస్తుంటాయి. దాంతో సోషల్‌ మీడియాలో పలురకాల కామెంట్స్‌ వస్తుంటాయి. ఇక ట్రోల్స్‌ తప్పవు. దీంతో జరిగిన పొరపాటు తెలుసుకుని తాము అలా కామెంట్‌ చేయలేదని వివరణ ఇచ్చుకుంటారు. ఇదే పరిస్థితి తాజాగా నటి హన్సికకు ఎదురైంది. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి, హీరోయిన్‌గా టాలీవుడ్‌ నుండి ఎంట్రీ ఇచ్చింది. నాయికగా ఆమె తొలి చిత్రం దేశముదురు. ఆ తర్వాత బిల్లా, కందిరీగ, మస్కా వంటి చిత్రాల్లో నటించింది. అదే సమయంలో తమిళ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్‌ హోదా పొందింది. తన ప్రియుడు సోహైల్‌ కథూరియాను గత డిసెంబర్‌లో వివాహం చేసుకుంది హన్సిక. ఇదిలా ఉంటే ఓ ఇంటర్య్వూలో హన్సిక తన కెరీర్‌ ప్రారంభంలో ఓ టాలీవుడ్‌ హీరో ఇబ్బంది పెట్టాడని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తనతో డేట్‌కి వస్తావా అని వేధించేవాడని, ఆయనకు బుద్దిచెప్పినట్టు హన్సిక పేర్కొందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ఈ ప్రచారం హన్సికను ఇబ్బంది పెట్టింది. దాంతో హన్సిక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రచారంలో వున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని పేర్కొంటు ట్వీట్‌ చేసింది. హన్సిక తగిన వివరణ ఇవ్వడంతో వివదానికి పులిస్టాప్‌ పడినట్టుగా భావించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement